మంచి రోజులొచ్చాయి ట్రైలర్.. మారుతి మార్క్ ఎంటర్‌టైనర్!

యువహీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన” ఏక్ మినీ కథ” సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కంప్లీట్ చేసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ మారుతి తన అసలైన మార్కులు చూపించబోతున్నాడు అన్నట్లుగా కనిపిస్తోంది. తన కెరియర్ మొదట్లో తీసిన సినిమాలలో ఒక మార్క్ ను మారుతి చూపించాడు. అయితే అప్పట్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని కామెంట్లు రావడంతో.. ఆ తరువాత మిగతా సినిమాలు ఎలా ఉన్నాయో అలా తీయగలం అని సమాధానం ఇచ్చారు.

ఇక ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాల జోలికి వెళ్ళలేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కొన్ని పాత్రలను సృష్టించి ఎంటర్టైన్ చేసేలా తీయసాగాడు ఇక ఈ సినిమాలో సంతోష్ మెహరీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ ఫుల్ కామెడీ ఫీల్ తో కనిపిస్తోంది. ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించాడు. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే నవంబర్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

Share post:

Popular