మా ఎన్నికలు: ఆల్టైమ్ రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం ఎవరిదంటే..?

మా ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ సాధారణంగా రెండు గంటల వరకు పోలింగ్ ఉంటుంది కానీ ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాల్లో నుండి నటులు వస్తుండడంతో ఆ సమయాన్ని ఒక గంట సేపు పెంచారు.అయితే ఎన్నడూలేని విధంగా మా ఎన్నికల్లో వివాదం సృష్టించింది.

ఇక అందులో నిలబడిన ప్రతి ఒక్క ప్యానెల్ సభ్యులు మాటల తూటాలు పేల్చారు. ఇంత హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ. ఇదే సమయంలో సినీ నటులు కూడా తమకు ఇష్టమైన వారికి ఓటు వేసేందుకు క్యూ కట్టారు. అందుచేతనే ఎన్నడూ లేనివిధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు సమాచారం.

ప్రస్తుతం మన అసోసియేషన్ సభ్యులు 925 మంది ఉండగా అందులో 883 మంది కి ఓటు హక్కు ఉంది. ఇక మధ్యాహ్నం 2:30 నిమిషాల సమయానికి 626 ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైనట్టు. మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంత మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మా ఎన్నికల్లో ఎప్పుడు కేవలం 500 మంది మించి పోలింగ్ నమోదు కాలేదు.కానీ తాజగా 700 మంది ఓట్లు వేయడంతో.. రికార్డు స్థాయిలో ఓటు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా మంచు విష్ణు ఒకే సపోర్ట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.