మా ఎన్నికలపై షాకింగ్ న్యూస్.. పోలీసులకు ఫిర్యాదు..!

మా ఎన్నికలపై రోజురోజుకు ఎన్నో ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి.మా ఎన్నికలపై కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు సంఘాల నేతలు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు.అదేమిటంటే బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే.. మా ఎన్నికలు జరపాలని జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు.3609 మంది జూనియర్ ఆర్టిస్టులు హక్కు కలిగి ఉన్నారని.. కానీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులకు కాదని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు

జూనియర్ ఆర్టిస్టుల సంఘాల నేతలు రవీందర్ సంకురి, రమావేణి అశోక్, శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైలాస్ కు విరుద్ధంగా పనిచేస్తున్న వల్లభనేని అనిల్ కుమార్, స్వామి గౌడ్ సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధంలేని శేషగిరిరావు నామినేషన్ రద్దు చేయాలని జూనియర్ ఆర్టిస్టుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇక అంతే కాకుండా ఓటర్ లిస్టు ను ఒకసారి సరి చేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెప్టెంబర్ మాసంలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశం జరిగిందని.. అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ఆరోజు ప్రకటించలేదని ఏ జెండా యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగిందని కానీ ఆరోజు కూడా అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరుపుతామని ప్రకటించలేదని తెలియజేశారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎస్.కే. మల్లిక అనే జూనియర్ ఆర్టిస్ట్ జూబ్లీహిల్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక జూనియర్ ఆర్టిస్టు యూనియన్ నుంచి..1600 కార్డులలో 720 మంది కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి 25 వేల కార్డు రెన్యువల్ పేరుతో.. సుమారుగా 1.80 కోట్ల రూపాయలు వసూలు చేశారని.. బైలాస్ కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదు లో తెలియజేశారు.

Share post:

Latest