మా ఎన్నికల పై చిరంజీవి మౌనం.. అందుకు కారణం..!

అక్టోబర్ 10వ తేదీన అనగా రేపు జరగబోయే మా ఎలక్షన్ల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వార్తలను చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ ఎన్నికల కంటే మా ఎన్నికలే అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు , అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు చాలా అధ్వానంగా ఒకరికొకరు దూషించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ తోడు ఉండగా,మంచు విష్ణు ఫ్యామిలీ కి బాలయ్యతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు రెండు ప్యానెల్స్ సభ్యులు చాలా అధ్వానంగా ఒకరికొకరు దూషించడం పై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరు వర్గాల ప్యానెల్ సభ్యుల పై సీరియస్ అయినట్లు సమాచారం. ఇకపోతే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే మంచు విష్ణు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు వాన్ని తెలుగు వాళ్ళు గెలిపించలేకపోతే తెలుగు వాళ్ల పరువు ఏమి కావాలి..? అన్న ఒక కారణం తోనైనా తప్పకుండా మంచి విష్ణుని గెలిపిస్తారు అంటూ కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అయితే చిరంజీవి ఆగ్రహం వెనుక ఉన్న కారణాలను.. ఎవరి పై ఆయన ఎలా స్పందించాడు.. అనే విషయాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారని సమాచారం.

Share post:

Popular