మా ఎన్నికల నుంచి తప్పుకున్న మరో కీలక నటుడు..!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికల విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే రీసెంట్ గా బండ్లగణేష్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇదంతా కేవలం ప్రకాష్ రాజ్ మరియు మంచి విషయాల మధ్య ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. మరి వీరిద్దరూ మీడియా ముఖంగానే గట్టిగానే ఒకరిపై.. ఒకరు విమర్శలతో పోటెత్తుతున్నారు.

ఈ పోటీలో నుంచి తన తప్పుకుంటున్నట్లుగా సి ఎల్ నరసింహారావు ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయగా దానిని పలు కారణాల చేత వెనక్కి తీసుకుంటున్నాను అని కన్ఫామ్ చేశారు. అంతేకాకుండా పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్న అన్నదానిపై త్వరలోనే మీడియా ముందుకు క్లారిటీగా వచ్చి తెలియజేస్తాం అన్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడు నిలబడిన ఏ ప్యానెల్ సభ్యులకు నేను మద్దతివ్వడం లేదని తెలియజేశాడు. అలాగే విజయశాంతి తనకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు cl నరసింహ రావు.ఎవరు గెలిచినా కూడా మా సంక్షేమం కోసమే పని చేయాలని తెలియజేశాడు.

Share post:

Latest