మా ఎన్నికలలో అతనే గెలవాలంటున్న ఫాన్స్..!

సినిమా కార్మికుల కోసం, నటుల కోసం సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినీ కార్మికులకు లేదా నటులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ్యత తీసుకొని, వారి సమస్యలను నెరవేరుస్తూ ఉంటారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మా ఎన్నికలలో ప్రస్తుతం ఉన్నంత ఉత్కంఠ ముందు లేదనే చెప్పాలి.. ఎందుకంటే ప్రస్తుతం నిలబడుతున్న కొంతమంది నటీనటులు గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు వచ్చి తామే మా అధ్యక్షులు గా నిలబడతాము అంటూ తెగ హంగామా చేస్తున్నారు.. రాజకీయ నాయకుల్లాగా ప్రగల్భాలు పలుకుతున్నారు.. ఇకపోతే అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే శివాజీ రాజా, నరేష్ వంటి మహా నటులు కూడా అధ్యక్ష పదవిని చేపట్టినా ఏ రోజు కూడా వీరు మీడియా ముందుకు వచ్చింది లేదు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది నటీనటులు అధ్యక్ష పదవి కోసం తహతహలాడుతున్నారు.. ఇకపోతే ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మా బిడ్డలు అనే ప్యానెల్ ను ఏర్పాటు చేసి పలువురు ప్రముఖులను కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడిన విషయం మనం రోజు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అంతేకాదు విష్ణు అధ్యక్ష పదవి చేపడితే , మా అసోసియేషన్ కోసం ఒక బిల్డింగ్ ను కూడా కట్టిస్తానని హామీ ఇస్తున్నాడు. ఇప్పటికే మంచు విష్ణుకు ..బాలకృష్ణ, బాబు మోహన్ లాంటి రాజకీయ అనుభవం కలిగిన ప్రముఖులు సపోర్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు విష్ణు నాన్న మోహన్ బాబు ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి , ఆయన సారథ్యంలో మంచు విష్ణు అధ్యక్ష పదవి చేపడితే ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది అని అభిమానులతో పాటు ఎంతో మంది సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు..

ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..మంచు విష్ణు అధ్యక్ష పదవి చేపడితే ప్రతి ఒక్కరికి సహాయం అందుతుంది అని , సినీ నటులు కూడా అనుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. సినీ నటుల, ప్రేక్షకుల ,అభిమానుల కళలు నెరవేరుతాయో.. లేదో.. మంచు విష్ణు అధ్యక్ష పదవి చేపడతారో లేదో అనే విషయం కోసం మనం వేచి చూడాలి.

Share post:

Latest