లెహ రాయి ఎన్ని కోట్లు లాభం తెచ్చి పెట్టిందో తెలుసా..?

అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదలయి 5 రోజులలోనే భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికి కూడా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు థియేటర్లో. పైగా ఈ సినిమాకి పోటీగా విడుదలైన మహాసముద్రం, పెళ్లి సందడి వంటి సినిమాలు కూడా విడుదల అయినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే కలెక్షన్ల వర్షం కురిపించింది.

కలెక్షన్ల విషయానికి వస్తే..
1).నైజాం: 6.64 కోట్లు
2).సీడెడ్: 3.52 కోట్లు
3).ఉత్తరాంధ్ర: 2.07 కోట్లు
4).ఈస్ట్: 1.03 కోట్లు
5).వెస్ట్: 84 లక్షలు
6).గుంటూరు: 1.19 కోట్లు
7).కృష్ణా: 93 లక్షలు.
8).నెల్లూరు: 70 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..16.92 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-3.42 కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది.

మొత్తం మీదుగా ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు గాను..20.34 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా మా థియేటరికల్ బిజినెస్ విషయానికొస్తే..19.71 కోట్లు జరగగా.5 రోజుల్లోనే..20.34 కోట్ల రూపాయలను వసూలు చేసి సినిమా తీసుకున్న బయ్యర్లకు, దర్శక నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.