కొత్తదనంతో ఆకట్టుకుంటున్న పుష్పక విమానం ట్రైలర్..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా”పుష్పక విమానం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ దామోదర నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైనా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ టీచర్ గా కనిపిస్తున్నాడు. వివాహమైన వారానికి తన భార్య లేచిపోతే పరువు పోతుందని ఆ విషయాన్ని దాచి పెట్టి ఎలాంటి కష్టాలు పడతాడు అనేది ట్రైలర్ లో చాలా ఫన్నీగా చూపించారు. ఇంటి ముందు ముగ్గు వేయడం, శారీ కట్టుకొని పాలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఒకానొక సమయంలో తన భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని విషయాన్ని బయట పెట్టవలసి వచ్చింది. అయితే వీరిద్దరూ కలుస్తారా లేదా అనే విషయం తెలియాలంటే నవంబర్ 12వ తేదీ వరకు ఆగాల్సిందే.

విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share post:

Latest