కొండ పొలం నుంచి అదిరిపోయే ధమ్ ధమ్ సాంగ్ రిలీజ్..!

డెబ్యూ మూవీతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఈసారి కొండపొలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు పాటను రిలీజ్ చేసి మరింత స్పందనను సొంతం చేసుకుంటోంది.. ఈ సినిమాలో బాగా చదివిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి చివరకు ప్రభుత్వ ఉద్యోగం లభించకపోవడంతో తిరిగి తన సొంత ఊరిలో గొర్రెల కాపరి గా మారి , తన ఊరిని రాక్షసుల నుంచి తమ గొర్రెలను ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.


ఇకపోతే తాజాగా విడుదలైన ఈ చిత్రం లోని పాట.. “పచ్చ పచ్చ చెట్టు సేమ పట్టు సీరెలంట.. నల్ల నల్ల ముళ్ళకంప నల్ల పూసలంట.. ధమ్ ధమ్ ధమ్ తిరిగేద్దాం.. వచ్చే ఈ పాట వినడానికే కాదు చూడడానికి కూడా పచ్చటి పొలాల మధ్య చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది.. ఈ సినిమా నుంచి ఈ పాట విడుదలైన అతికొద్ది సమయంలోనే మంచి వ్యూస్ నీ అందుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు చూస్తుంటే ఖచ్చితంగా వైష్ణవి తేజ్ ఈసారి కూడా మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నాడు.

ఈ సినిమా తో మంచి విజయాన్ని అందుకుంటే ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అంటూ సినీ ఇండస్ట్రీలో వినికిడి.ఈ పాటను మీరు కూడా ఒకసారి చూసేయండి..

https://youtu.be/cVsg_AFrf3A