కార్తికేయ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగానే కాకుండా ఈ మధ్య కాలంలో విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు.అలాగే తాజాగా రాజా విక్రమార్క సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టైటిల్ ని ఇప్పుడు అదే టైటిల్ తో లాంచ్ అయిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

 

రాజా విక్రమార్క సినిమాని సాయి శ్రీ వల్లి డైరెక్టర్ చేస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ ని నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. కార్తికేయ ఇంటిలిజెన్స్ స్పై గా నటిస్తున్నారు ఈ సినిమాలో. అందుచేతనే ఈ సినిమాని థ్రిల్లర్ సినిమాగా ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. హీరో కార్తికేయ విలన్ గా, ఆటు హీరో గా మంచి సక్సెస్ను అందుకున్నాడు.

ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.