జబర్దస్త్ లో వెక్కి వెక్కి ఏడ్చిన రష్మీ.. కారణం..!

ప్రస్తుతం రష్మీ మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. రష్మీ మొదట్లో సినిమాల్లో నటించినప్పటికీ, ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక దాంతో జబర్దస్త్ కార్యక్రమం లో యాంకర్ గా ప్రత్యక్షం అయి అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. తన అందంతో, అభినయంతో, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ..జబర్దస్త్ లో యాంకర్ గా ఈమెకు తిరుగులేకుండా చేసుకుంటోంది. అంతే కాదు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ జోడి లో కూడా యాంకర్గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటోంది.

- Advertisement -

ఇక సుధీర్ – రష్మీ జోడి అందరికీ బాగా ఫేమస్ అనే చెప్పాలి. అయితే వీరిద్దరూ కేవలం షో కోసం మాత్రమే చేస్తున్నారు అని తెలిసినప్పటికీ వీరిద్దరి జోడీకి అభిమానులు చాలా మంది ఉన్నారు.. ఇకపోతే రష్మి చాలా సెన్సిటివ్ అని అందరికీ తెలిసిన విషయమే . చిన్న చిన్న విషయాలకు అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా కూడా రష్మి ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కన్నీళ్ళు పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చింది. ఇక ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

అదేమిటంటే , ప్రోమోలో రాకేష్, రోహిణికి రోస్ ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఐదేళ్ల పరిచయానికి గుర్తుగా ఐదు రకాల సర్ప్రైజ్ లు ఇస్తాడు రాకేష్. ఇక ఇలా రోహిణికి , రాకింగ్ రాకేష్ ప్రపోజ్ చేస్తున్న సమయంలోనే రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆమె మాత్రం బాగా ఏడ్చింది. రోహిణి..రష్మీ దగ్గరికి వెళ్లి ఓదార్చుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు రష్మి ఎందుకు ఏడుస్తోంది అంటూ షాక్ అవుతున్నారు.

 

Share post:

Popular