ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటూ నాగచైతన్య ట్వీట్ వైరల్..!

విడాకులు తీసుకున్న తరువాత బాధ పడాల్సి పోయి హ్యాపీగా ఉన్నానంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి.. ఇదివరకే నాగచైతన్య, సమంత నుంచి విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్ ల పై నెటిజన్ల తో పాటు ఫ్యాన్స్ కూడా ఫోకస్ పెరిగింది..ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతారు..? ఏమని ట్వీట్ చేస్తారో తెలుసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టిన స్టేటస్ వైరల్ కాగా, నాగచైతన్య తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు..

ఇకపోతే నాగచైతన్య హ్యాపీగా ఉంది అన్నది తను విడాకులు తీసుకున్న విషయానికి కాదు.. సాయిధరమ్ తేజ్ కోలుకున్నారని.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగాహీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారు.. తాను బాగానే ఉన్నానని కోలుకొంటున్నానని సాయి ధరంతేజ్ నిన్న హాస్పిటల్ బెడ్ పైనుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయం పై పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేయడంతోపాటు వరుస బెట్టి ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కినేని నాగ చైతన్య కూడా స్పందించడం జరిగింది.

ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది లాట్స్ ఆఫ్ లవ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఈ ట్వీట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest