ఇప్పుడైతే నిన్నే పెళ్లాడతా సినిమా లో ఆ సీన్ చేసే వాడిని కాదు..నాగార్జున?

మనం ఎన్నో రకాల సినిమాలు చూసినా కూడా కొన్ని సినిమాలను ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాంటి నిన్నే పెళ్లాడతా సినిమాలోసినిమా కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, టబు నటించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా విడుదల అయి అక్టోబర్ 4వ తేదీకి 25 ఏళ్ళు కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ సినిమా హీరో హీరోయిన్ల స్పెషల్ టాక్ ఏంటో కూడా విందాం.నిన్నే పెళ్ళాడుతా సినిమా కు అప్పుడే పార్టీలు పూర్తయ్యాయి అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి.

కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాత గా మారాను. అప్పటివరకు నాన్నగారు అన్నయ్య సినిమాలు తీస్తున్నారు, నాన్న రిటైర్డ్ అవ్వడం పెద్దన్నయ్య సినిమాలు తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను. కృష్ణవంశీ ఈ సినిమాను తక్కువ రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని నాకు బాగా హెల్ప్ చేశారు. సినిమాలో బై సీక్వెన్స్ ని డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఇలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దని చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం. పాటల్లో పెద్దగా డాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్గా గా నిలిచాయి.