దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ .. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల తేదీని మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు చిత్రం యూనిట్.. ముఖ్యంగా రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేద్దామన్నా.. స్టార్ హీరోల సినిమాలు అడ్డు వస్తుండటంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ.. అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఇక ఈ నేపథ్యంలో కచ్చితంగా 2022 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని తెలుపుతూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రం యూనిట్. దీంతో ఎట్టకేలకు జనవరి 7వ తేదీన సినిమాను చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
07.01.2022. See you at the Cinemas!!
Get ready to experience India’s Biggest Action Drama in cinemas worldwide. #RRRMovie #RRROnJan7th @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies pic.twitter.com/BOoYC8q6j1
— Alia Bhatt (@aliaa08) October 2, 2021