ఇప్పటి వరకు `మా` అధ్యక్షులుగా ఎవరెవ‌రు పని చేశారో తెలుసా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ సారి మా ఆధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టేందుకు ఓవైపు మంచు విష్ణు, మ‌రోవైపు ప్ర‌కాశ్ రాజ్‌లు పోటీ ప‌డుతుండ‌గా.. వీరిలో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో మ‌రి కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. `మా` గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

 ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA Elections 2021) ఎన్నికల గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఏ రోజైతే ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చి తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రకటించాడో.. అప్పట్నుంచీ అదే హీట్ కనిపిస్తుంది. ఆ తర్వాత లోకల్ చంటిగాడు అంటూ మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికల బరిలో దిగడంతో హీట్ మరింత పెరగింది. (Twitter/Photo)

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తొలిసారి 1993లో ఏర్పటైంది. తెలుగు సినీ రంగంలోని నటీనటులు సంబంధించిన వివాదాలు, సమస్యల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారులను ఆదుకోవడం సినిమా ఛాన్సులు ఇప్పించడం ‘మా’ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

PHOTOS: Chiranjeevi and Mohan Babu are inseparable at MAA Calendar launch | Telugu Movie News - Times of India

ఇక మెగాస్టార్ చిరంజీవి(1993-95) తొలిసారి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ త‌ర్వాత ఘట్టమనేని కృష్ణ(1995-1999), మురళీ మోహన్‌(1999-2000), నాగార్జున(2000-2002), మురళీ మోహన్‌(2002 – 2004), నాగబాబు(2006-2008), మురళీ మోహన్‌(2008-2015), శివాజీ రాజా(2015-2019), వీకే న‌రేష్‌(2019-2021) లు ఇప్ప‌టి వ‌ర‌కు మా అధ్య‌క్షులుగా ప‌ని చేశారు.