యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న మరొక ఫోక్ సాంగ్?

ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సినిమా లలో భారీ బడ్జెట్ తో కచ్చితంగా ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మధ్య కాలంలోనే విడుదల అయిన సారంగదరియా, అలాగే బుల్లెట్ బండి పాటలు ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.

- Advertisement -

ఇంకా ఇది ఇలా ఉంటే తాజాగా వరుడు కావలెను సినిమా నుంచి రిలీజ్ అయిన దిగు దిగు నాగ అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ పాటకు దాదాపు 20 aమిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా నవంబర్ 4 న ముందుకు రానుంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయ ఘోషల్ ఆలపించగా, తమన్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

Share post:

Popular