యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉండగా చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అందరీ లాగే ఎన్నో అల్లరి పనులు, చిలిపి పనులు చేసే వారట. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఏమి తెలియని వయసులోనే స్మోకింగ్ చేసేవాణ్ని అని ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇలా తన చిన్నతనంలో ఇంకా ఎన్నో అల్లరి పనులు చేశానని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.