చిత్ర సినిమా పరిశ్రమలో విషాదం.. ఎన్టీఆర్ మిత్రుడు మృతి..?

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక ఈయన మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈయన తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పేరుతో ఎన్నో చిత్రాలు నిర్వహించారు.మహేష్ ..ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్, వంటి హీరోలకు పిఆర్ గా పనిచేశాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు, మిస్ ఇండియా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ మృతిపట్ల ఎన్టీఆర్ స్పందించారు. ఈ విషయం తెలిసి ఒక్క సారిగా షాక్ కు గురయ్యానని తెలియజేశారు.దీంతో పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఆయన మరణానికి సంతాపం తెలిపారు. నా ఆప్తమిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురి అయ్యాడు ఎన్టీఆర్.

Share post:

Latest