అల్లు రామలింగయ్య నాకు ఆ చికిత్స చేశారు.. చిరంజీవి?

తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లు రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు ఆయన 100 వ జయంతి సందర్భంగా చిరంజీవి రాజమండ్రిలో పర్యటించనున్నారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హామియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రి తో తనకు అనుబంధం ఉందని, తన మొదట మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని తెలిపారు. అల్లు రామలింగయ్య కు నాకు గురుశిష్యుల అనుబంధం ఉంది.

అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నటుడిగానే కొనసాగుతూనే హోమియోపతి పై పట్టు సాధించారు. నిత్యం విద్యార్థుల లాగానే అల్లు రామలింగయ్య కూడా ఎంతో కష్టపడ్డారు. ఎంతోమందికి సేవ చేశారు. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్ లాంటి వ్యక్తులకు చికిత్సను అందించారు. అంతేకాకుండా నేను ఒక సారి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్స పూర్తిగా నయం చేశారని తెలిపారు చిరంజీవి. ఆ తరువాత నాకు ఇంతవరకు మళ్లీ ఆ సమస్య ఎదురు కాలేదు. ఇప్పటికీ నాతో పాటుగా నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా హోమియోపతి ని ఫాలో అవుతున్నారు అని తెలిపారు చిరంజీవి.

Share post:

Popular