చదువుకోవడం కంటే బర్రెలు కాయడం మేలంటున్న గ్రాడ్యుయేట్..!

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బర్రెలు కాస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఇది చక్కటి నిదర్శనమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది..

ఆ విద్యార్థి ఆ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత సదివిన గాని డిగ్రీల మెమోలు వస్తాయి తప్ప జాబులు వచ్చేటట్టు లేవు. నోటిఫికేషన్ వెయ్యడు ఏమి వెయ్యడు.. అందుకే మా అమ్మను అడిగి గీ నాలుగు బర్లను కొన్న. రోజుకొక బర్రె ప్రొద్దున మూడు లీటర్లు, సాయంత్రం నాలుగు లీటర్లు పాలిస్థాయి. రోజు ఆరు లీటర్లు.. మూడు వందల ఎటూ పోవు.. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి.. హాయ్’ అంటూ ఓ నిరుద్యోగ విద్యార్థిని తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఇలానే ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.