క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. రూ. లక్ష ఆఫర్..!

బిగ్ బాస్ సీజన్ -5 లో పాల్గొన్న కంటేస్టెంట్ లలో శ్వేత వర్మ కూడా ఒకరు.6 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈమె చివరి వారంలో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా తెలియజేసింది.

గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేసిన శ్వేత వర్మ మరొకసారి ఈ విషయంపై మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ కౌచ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదని, అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్వేత తెలియజేసింది.

ఇక తన విషయంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని శ్వేత వర్మ తెలియజేసింది. ఒక డైరెక్టర్ తన ఫేస్ బుక్ ద్వారా కమిట్మెంట్ అడిగినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని తానే స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాను అని కూడా తెలియజేసింది.అలాగే 2015 సంవత్సరంలో ఒక యాడ్ కోసం ఒక డైరెక్టర్ లక్ష రూపాయలు ఇస్తాను కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడట.కానీ శ్వేత బిల్డింగ్ పై నుంచి దూకి చావండి అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయిందట. ఇలా ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటు తెలియజేసింది.

Share post:

Latest