ప్రియాంక బర్తడే కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్?

బిగ్ బాస్ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా నలుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ప్రవేశపెట్టిన రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదట కుస్తీలో విశ్వ,మానస్ ను ఓడించి గెలిచారు. ఆ తర్వాత ఆనీ మాస్టర్ ను జెస్సి ఓడించాడు. ఇలా ఈ టాస్క్ లో రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. అవి దగ్గర 150 నాణాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే మరొక పక్క అమితా శ్రీరామ్ ని తన కౌగిలిలో బంధించింది.

ఇది ఇలా ఉంటే ప్రియాంక సింగ్ గతంలో తాను ట్రాన్స్ జెండర్ గా మారి మూడు సంవత్సరాలు అవుతున్న ఆ విషయం తన తండ్రికి తెలియదని, తన తండ్రికి చెప్పకుండా మోసం చేస్తున్నానని తెలిపిన విషయం అందరికి తెలిసిందే. ఒకరోజు తన తండ్రి మీసం గడ్డం ఏ విధంగా అని అడిగినప్పుడు లేడీ గెటప్ కోసం తీసేసాను అంటూ అబద్ధం చెప్పాను అని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. రేపటి ఎపిసోడ్ లో ప్రియాంక బర్త్ డే సందర్భంగా బిగ్బాస్ ఆమెకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తన తండ్రి స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో ఎమోషనల్ అయ్యింది.