బిగ్ బాస్: లోబో ఎలిమినేట్ గుండెలు బాదుకున్న విశ్వ?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. లోబో రవి ఏం చెబితే అది చేస్తాడు. తనకేం తనే ఆడమని నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా లోగో ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని హౌస్ ప్రాపర్టీ ని కూడా డ్యామేజ్ చేశాడు. ఈ విషయంలో నాగార్జున రవి గడ్డి తినమంటే తింటావా అంటూ లోబో పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోబో ప్రియా బిగ్ బాస్ హౌస్ కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. ఈ ప్రక్రియలో లోబో కు ప్రియా కు సమానంగా నాలుగు ఓట్లు పడటంతో వీరిద్దరికీ నాగార్జున ఒక పరీక్ష పెట్టాడు. హౌస్ మేట్స్ ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తే వాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పాడు.

రవి, సన్నీ, విశ్వ ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిలబడగా మిగిలిన సభ్యులు అందరూ ప్రియ కు మద్దతుగా నిలిచారు. దీనితో లోబోఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో రవి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. విశ్వ వెక్కి వెక్కి ఏడ్చాడు. తప్పు చేసిన వాళ్ళు ఉంటున్నారు లోబోను ఎలిమినేట్ చేసారేంటి అంటూ బోరున విలపించారు. ఆ తరువాత లోగో అందరికీ గుడ్ బై చెబుతూ తప్పు చేస్తే క్షమించాలని కోరుతూ.. ఒకసారి ఇంటి సభ్యులతో డాన్స్ చేయిస్తూ ఎమోషనల్ అయ్యాడు లోబో.

Share post:

Latest