బాలయ్యకు గాయం ..నందమూరి అభిమానుల్లో కలవరం!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక చేతికి కట్టు కట్టుకుని కనిపించడం అభిమానులను కలవరపరుస్తోంది. ఆయనకు ఏమైంది..అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆహా యాప్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు.

కానీ ఆహా యాప్ కోసం ప్రస్తుతం ప్రోమోస్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ ప్రోమోస్ విడుదల చేయాలని ఆహా యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే బాలకృష్ణ ప్రత్యేక షూట్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చేతికి గాయం అయిందని సమాచారం. అందుకే ఆయన చేతికి కట్టు కట్టు ఉన్నారని తెలుస్తోంది. గాయం అయినప్పటికీ కూడా బాలకృష్ణ షూటింగ్ కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆహా యాజమాన్యం భారీగా ఖర్చు పెడుతోంది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు, పర్యవేక్షిస్తున్న క్రిష్ కు భారీ మొత్తంలో ముట్ట చెబుతున్నట్లు సమాచారం.

బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరించే కార్యక్రమానికి మొట్టమొదటి అతిథిగా చిరంజీవిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, నాని తదితరులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా..అని నందమూరి అభిమానులతో పాటు ఆయా హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest