ఆషా ఎన్కౌంటర్ ట్రైలర్..?

టాలీవుడ్ లో వివాదాస్పదమైన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆశ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా ఉద్దేశించి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే దిశ అత్యాచారం సినిమా తీయనున్నట్లు ఆర్జివి ప్రకటించడంతో అనేక విమర్శలు వచ్చాయి.

దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. కరుణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేశాడు రాంగోపాల్ వర్మ. గతంలోనే పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమా టైటిల్ ను చేంజ్ చేసి మరో పోస్టర్ కూడా విడుదల చేశాడు. అందులో నవంబర్ 26వ తేదీన సినిమా విడుదల చేస్తానని ప్రకటించారు.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్”ఆశ ఎన్కౌంటర్” అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇక ట్రైలర్లు ఇక ఎవరినీ ఉద్దేశించినది కాదని ప్రజలు టీవీలో చూసిన, తెలిసిన కొన్ని సన్నివేశాలను ట్రైలర్ లు చూపించాలని చెప్పుకొచ్చాడు ఆర్జీవి. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest