అనవసరంగా పోలీసులు కొడుతున్నారా..? ఇకపై వాళ్లు కూడా వూసలు లెక్క పెట్టాల్సిందే..!

ఈ మధ్యకాలంలో సిన్సియర్ పోలీసులు ఎంత మంది ఉన్నప్పటికీ కొంత మంది పోలీసులు చేసే కొన్ని చెడ్డ పనుల వల్ల మొత్తం పోలీసు శాఖ కి చెడ్డపేరు వస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే పోలీసులు అహంకారంతో మేము అధికారంలో ఉన్నాము..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఇష్టారాజ్యంగా అమాయక ప్రజలపై పోలీస్ అనే అధికార పంజాను విసురుతున్నారు. ఈ నేపథ్యంలోని రైతన్నలను మొదలుకొని రోడ్ సైడ్ జీవనాన్ని గడిపే చాలామంది నిరుపేదల వరకు ఎంతో మంది బలి అవుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది అదేంటో ఇప్పుడు ఒకసారి చదివి మనం కూడా తెలుసుకుందాం..

పోలీస్ యాక్ట్ 1861 లోని సెక్షన్ 29 ప్రకారం.. ఏ పోలీస్ అధికారైనా.. తమ కస్టడీలో లేని వ్యక్తిని కానీ లేదా మరే వ్యక్తినైనా కానీ ఆధారాలు లేకుండా క్రూరంగా హింసించడం, కొట్టడం లాంటివి చేస్తే ఆ బాధితుడు.. ఆ పోలీస్ అధికారి పై సమీపంలో ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేయవచ్చట. ఒకవేళ కొట్టినట్లు ప్రూవ్ అయితే ఆ పోలీస్ అధికారి కి మూడు నెలల జైలు శిక్ష తో పాటు మూడు నెలల జీతాన్ని కూడా కట్ చేస్తారట. లేదా.
మూడు నెలలు తమ జీతాన్ని అయినా కట్ చేస్తారు లేదా మరో మూడు నెలలపాటు కర్మాగారంలో బంధించే అవకాశాలు కూడా ఉంటాయి