అమ్మాయిల.. లైంగిక వేధింపుల కేసులో డైరెక్టర్ శంకర్ అల్లుడు..?

ప్రముఖ చిత్ర దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఇక ఇదే కేసులో మరొక 5 మంది పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పదహారేళ్ల బాలిక పై లైంగికంగా వేధించారని కేసుల మంగళవారం పుదుచ్చేరిలోని రోహిత్ దామోదర పై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

రోహిత్ దామోదరన్ విషయానికొస్తే.. ఈ సంవత్సరంలోనే జూన్ నెలలో మెగా డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ను వివాహం చేసుకున్నారు. ఇక అతను క్రికెట్ క్లబ్ కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా ఈ అమ్మాయి క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించారని తన ఫిర్యాదులో తెలియజేసింది.

ఒకవేళ అధికారులకు తెలియజేస్తే ఈ విషయాన్ని.. నిన్ను చంపేస్తామంటూ బెదిరించారని తెలుపుతోంది. డైరెక్టర్ శంకర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన డైరెక్టర్ గా పేరు పొందాడు. అయితే ఈ వార్త రావడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి తెలుగులో ఒక సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు

Share post:

Latest