అక్కడికి వెళితే రాళ్లతో, చెప్పులతో కొడతారంటున్న రాజీవ్..!

రాజీవ్ కనకాల సినీ ఇండస్ట్రీలోకి సహాయకుడి పాత్రల్లో నటించడానికి అడుగుపెట్టి , కొంత వరకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. కాకపోతే ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ వంటి సినిమాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు అనే చెప్పాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలోనే లవ్ స్టోరీ సినిమాతో మాత్రమే ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర ఇచ్చిన ట్విస్ట్ వల్లే లవ్ స్టోరీ సినిమా హిట్ గా నిలిచింది.

Suma Kanakala Comments Husband Rajeev Kanakala After Watching Love Story -  Sakshi

రాజీవ్ కనకాల సాయి పల్లవికి బాబాయ్ నరసింహం పాత్రలో పూర్తిగా న్యాయం చేశారు అని ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడ్డారు అని శేఖర్ కమ్ముల, సుమా కూడా వెల్లడించారు.. ఈ సినిమాలో సాయి పల్లవి కి మేనమామ గా తన పాత్రను మార్చాలని కోరినా, శేఖర్ ఖమ్ముల మాత్రం అంగీకరించలేదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.. శేఖర్ కమ్ముల విలన్ రోల్ అని చెబితే విలన్ పాత్ర మామూలుగా ఉంటుందని కూడా అనుకున్నాను.. కానీ చైల్డ్ మాలిస్టేషన్ సీన్ గురించి చెబితే షాక్ అయ్యానని రాజీవ్ కనకాల వెల్లడించారు..

Anchor Suma Divorce Rumours: Rajeev Kanakala Reveals Shocking Facts - Sakshi
ఈ సినిమా విడుదల అయిన తర్వాత హైదరాబాదులో ఉండే వాళ్ళు తన పాత్రను బాగా చేశావ్ అని చెబుతున్నారు అని చెప్పాడు..కానీ బి సి సెంటర్ కి వెళ్తే మాత్రం తనను చెప్పులు, రాళ్లతో కొడతారని రాజీవ్ కామెంట్ చేశారు.. లవ్ స్టోరీ సినిమా లోని తన పాత్ర నిజమేనని భావించి, తనను అలాంటి వ్యక్తి గాని అనుకుంటారని రాజీవ్ కనకాల వెల్లడించాడు.