ఆది ‘తీస్ మార్ ఖాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందిగా?

హీరో ఆది అనగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ప్రేమ కావాలి. ఈ సినిమాతో ప్రేక్షకులు లవర్ బాయ్ గా ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు ఆది సాయి కుమార్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రీ ఎంట్రీ రాబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజన్ సినిమా బ్యానర్ పై నాగం తిరుపతిరెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇందులో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నటుడు సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లో ఆది నెవెర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ ఆది సిగరెట్ కాలుస్తూ, నడుస్తూ వస్తున్నట్లు ఒక మాస్ లుక్ లో ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలు స్టూడెంట్,రౌడీ, అలాగే పోలీస్ గా ఇలా మూడు వేరియేషన్స్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Share post:

Popular