హీరో శింబు పై కుట్ర ..?

నటుడు శింబు పై కుట్రకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి రాజేందర్, ఉష డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు శింబు నటించిన అన్భాధావన్, అసరధావన్, అడంగాదావన్ సినిమాకు నిర్మాత మైకేల్ రాయప్పన్ నిర్మించారని, అయితే ఆ సినిమాలో కథానాయకుడిగా నటించినా శింబుకి పూర్తిగా పారితోషకం చెల్లించలేదని అన్నారు. అలాంటిది శింబునే అతడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ నిర్మాతల మండలిలో వారు ఫిర్యాదు చేయడం, శింబు పై కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని రాజేందర్ ఆరోపించారు.

ఉషా రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం స్టాలిన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం కోసం ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. శింబు పై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తా మన్నారు.

Share post:

Popular