ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు.. సీఎం జగన్?

ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్పీ బాలు వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సందర్బంగా జగన్ మధుర గాయకులు, స్వరకర్త అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు.తన మధుర గాత్రంతో తెలుగు వారినే కాకుండా అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలు అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కాగా గతేడాది సెప్టెంబర్‌ 25న ఎస్పీ బాలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Share post:

Popular