విరాటపర్వం రిలీజ్‌పై క్లారిటీ.. అందులో మాత్రం కాదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు కరోనా పెద్ద అడ్డంకిగా మారడంతో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అటు చిత్ర యూనిట్ నుండి కూడా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. థియేటర్‌లో ఈ సినిమా రిలీజ్ అసాధ్యమని చిత్ర వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో చిత్ర షూటింగ్‌ను పూర్తిగా ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular