వైరల్: విరాట్ కోహ్లీ మరొక షాకింగ్ డెసిషన్..?

టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మనందరికీ బాగా తెలిసిన క్రికెటర్.. ఇక ఈ మధ్య కాలంలో టి20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గా ప్రకటించి అమ్మాయిలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

అది ఏమిటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొనున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది.ఐపీఎల్ 2021 సీజన్ ని ఆర్సిబి కెప్టెన్ గా కోహ్లీ చివరిసారిగా చేస్తాడు అన్నట్లుగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఆటగాడి గా మాత్రం జట్టులో కొనసాగుతున్నాడట. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సిబి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం కాస్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది.

అయితే ఇక 2022 సంవత్సరానికిగాను ఆర్సిబి తరఫునుంచి ఎవరు కెప్టెన్గా ఎంచుకుంటారు అనే విషయం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ విషయంపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో అనే విషయం కొద్ది రోజుల్లో తెలుస్తుంది.https://www.instagram.com/p/CUAr4FbrhM_/?utm_source=ig_embed&ig_rid=8a658678-080e-4ff4-be9f-9b283d358f33

Share post:

Popular