పెళ్లి చేసుకోనుంటున్నా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్..?

నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అష్టా చమ్మా తొలి సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో జీవిత విషయంలో అతడి అదే శైలి అంటూ తెలిపారు. జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట.తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని తేల్చిచెప్పాడు. అయితే ఎందుకు గల కారణం మాత్రం వెల్లడించలేదు.

తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనూ అని మాత్రం తెలిపారు. ఎందుకు అని అడిగితే మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత కఠినమైన నిర్ణయం అని అన్నాడు అవసరాల శ్రీనివాస్. సింగిల్ గా మన జీవితంలో ఏదో మనం బతుకుతూ హ్యాపీ గా ఉన్నప్పుడు, వేరొక వ్యక్తి మన జీవితంలోకి తీసుకొని వచ్చి వాళ్లతో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించడం అనేది అంత తేలికైన విషయం కాదు, అందువల్ల పెళ్లి తీసుకోవాలి అనుకోవడమే కఠినమైన నిర్ణయమని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఇక సినీ విషయానికి వస్తే స్నేహితులు భావిస్తున్నట్టుగా తానేమీ సినీరంగంలో కష్టాలు పడడం లేదని తెలిపారు.

Share post:

Latest