టిక్ టాక్ దంపతుల మోసం.. ఏకంగా 40 లక్షలు లూటీ..!

ప్రజలు అన్నీ చూస్తున్నా.. చదువుతున్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్ళ వలలో ఇట్టే పడిపోతున్నారు.. అన్నీ తెలిసి కూడా అప్పనంగా ముట్ట చెబుతున్నారు అనేది వాస్తవం.. ఇలాంటి సంఘటన.. ఒక దంపతుల మోసానికి ఒక అమాయకుడు బలి అయ్యారు.. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే , తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం లో టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీ లు విదేశాలలో ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి, ఏకంగా నలభై నాలుగు లక్షల రూపాయలను..గోకవరానికి చెందిన గౌరీ శంకర్ అనే వ్యక్తి నుంచి లూటీ చేసుకున్నారు.. గౌరీ శంకర్ కూతుర్ని ఎలాగైనా సరే విదేశాలలో ఉన్నత చదువులకు పంపిస్తామని, మాయమాటలు చెబుతూ వారి ని పూర్తిగా మార్చేసి, డబ్బులు కాజేసిన సమాచారం ఇటీవల వెలుగులోకి వచ్చింది..


అనుమానం వచ్చిన బాధితులు వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు.. ఇక ఈ కేటుగాళ్లు ఇద్దరూ తమ సెల్ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు.. ఇక మోసపోయామని తెలుసుకుని వెంటనే గౌరీశంకర్ గోకవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం జరిగింది.. ఇక పోలీసులు తమ తెలివిని ఉపయోగించి కేటుగాళ్ల ను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరు పరిచినట్లు సమాచారం.. కోర్టు వీరికి 15 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Share post:

Latest