థర్డ్ వేవ్.. ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేస్తే సరి..?

కరోన ప్రతి ఒక్కరిని భయ భ్రాంతులకు గురి చేసింది. ఇక ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ రాబోతున్నట్లు గా కొంతమంది వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా పిల్లలకే సోకే ప్రమాదం ఉన్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి చూద్దాం.

1). కరోనా వైరస్ సోకిందా..? జలుబు అయ్యిందా..? అనే ఈ రెండు విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలి.

కరోనా సోకితే.. తక్కువ మోతాదులో జ్వరం, ముక్కుకారడం, గొంతు నొప్పి, తలనొప్పి, జీర్ణాశయం సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఆ పిల్లలకు కోవిడ్ -19 సోకి ఉండవచ్చు. ఒకవేళ కరోనా సోకిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.. అందుచేతనే ఒకసారి నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే మంచిది.

2). కొవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్న కొందరు పిల్లలు, టీనేజ్ లో కనిపించి ఏకైక లక్షణం.. చర్మం మీద గీతలు లాంటి గాయాలు, కాలి వేళ్ళ మీద గాయాలు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి.

3). పిల్లలకు స్వల్ప లక్షణాలు ఉన్న టెస్ట్ చేయించడం మంచిది. కరోనా సోకిన వృద్ధుడు ఉన్న ఇంట్లో పిల్లలతో మన పిల్లలు బయట ఆడుకున్న, స్నేహితులతో కలిసినా.. వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

4).ఒకవేళ ఇంట్లో ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే వీలైనంత వరకు ఇంట్లో పెద్దవాళ్ళను ఒక ప్రత్యేక గదిలో ఉంచాలి. ఇక పిల్లలకు ఆ పెద్ద వాళ్ల నుంచి ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం చాలా మంచిది.

5). ఒకవేళ పిల్లలకు పాజిటివ్ అని తేలితే.. ముందుగా మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.. ఇంట్లో వారు కూడా ఒక్క సారి అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలి.. ఇక ఇప్పటికీ పిల్లలకు కావలసిన టీకా మీద ట్రయల్స్ జరుగుతోంది కాబట్టి పిల్లలకు కావల్సిన విశ్రాంతిని ఇవ్వడం, హైడ్రేటెడ్ గా ఉండడం కోసం జ్యూసులు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పిల్లలను పర్యవేక్షిస్తూ తీవ్రమైన లక్షణాలతో ఒకవేళ బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి..

ఆకస్మిక శ్వాస లోపం, అధిక జ్వరం ,కడుపునొప్పి, చాతి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే , వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం , సరైన ఆహారం తీసుకోవడం ,టీకాలు వేయించడం వంటివి చేయడం వల్ల కరోనా నుంచి విముక్తి పొందవచ్చు.