నిందితుడిని జైలుపాలు చేసిన సినిమా సీన్..టీవీ చూస్తూ లైంగిక దాడిని బయటపెట్టిన చిన్నారి..!

నిందితుడిని జైలుపాలు చేసిన సినిమా సీన్..టీవీ చూస్తూ తనపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన చిన్నారి..!

టీవీ లో వస్తున్న ఓ సినిమా చూసి తనపై లైంగిక దాడి జరిగినట్లు ఓ చిన్నారి గుర్తించింది. ఆమె ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడికి జైలు శిక్ష పడింది. సినిమాలు సమాజానికి మేలు చేసేది లేదని వాదనలు జరుగుతున్నప్పటికీ.. సినిమాల వల్ల మంచి జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సినిమాల వల్ల మంచి కూడా జరుగుతుందని సపోర్ట్ చేసే వారు ఉన్నారు.

అలా ఓ సినిమా చూసి తనపై లైంగిక దాడి జరిగినట్లు ఓ చిన్నారి గుర్తించింది. తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక ప్రధానపాత్రలో పొన్ మగళ్ వందాళ్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఈ సినిమా వచ్చింది. ఇందులో ‘ పేరెంట్స్ వద్ద పిల్లలు ఏ విషయం దాచకూడదు’ అని ఓ సీన్ ఉంది. ఈ సినిమా టీవీలో ప్రసారం అవగా.. సినిమా చూస్తున్న తొమ్మిదేళ్ల చిన్నారి ఈ సీన్ చూసి తనపై జరిగింది లైంగిక దాడి అని తెలుసుకుని విషయాన్ని తల్లికి తెలియజేసింది.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు లైంగిక దాడి జరిగిందని నిర్ధారించి నిందితుడికి జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించిన జ్యోతిక తాజాగా వెల్లడించింది. తాను నటించిన ఓ సినిమా ద్వారా మేలు జరిగింది అని సంతోషం వ్యక్తం చేసింది. ఇన్ స్టా గ్రామ్ ద్వారా జ్యోతిక ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ న్యూస్ తమిళనాడులో వైరల్ గా మారింది.

Share post:

Latest