తల్లిదండ్రులపై కేసు వేసిన దళపతి..!! కారణం..?

కోలీవుడ్ సూపర్ స్టార్ గా దళపతి గా గుర్తింపు పొందిన విజయ్ ఇటీవల వార్తల్లోకి ఎక్కాడు. ఈయన తన సినిమాలతో ఎప్పటికప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాదు ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు ఇకపోతే ఇటీవల తన తల్లిదండ్రుల పై కోర్టులో కేసు వేసినట్లు సమాచారం అయితే ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయ్ తండ్రి తన పేరును కానీ, తన ఫ్యాన్ క్లబ్ పేరును కానీ రాజకీయాల్లో ఉపయోగించవద్దని తన తండ్రి SA చంద్రశేఖర్‌కు న్యాయవాది ద్వారా నోటీసు పంపారు. విజయ్ ప్రజా ఉద్యమ కార్యకలాపాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా అతని తండ్రి చంద్రశేఖర్ మరియు అతని పార్టీ బాధ్యత వహించదని నోటీసులో పేర్కొన్నారు. అలాగే విజయ్ అనుమతి లేకుండా..ఆల్ ఇండియా కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అనే రాజకీయ పార్టీ ప్రారంభంతో మరియు తన సమ్మతితో ప్రారంభమైన ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ అనే సంస్థతో తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు.

తన తండ్రి పార్టీని ప్రారంభించినందున తన మీద అభిమానంతో పార్టీలో చేరవద్దని లేదా పార్టీకి సేవ చేయవద్దని ఆయన అభిమానులను కోరుతున్నారు. ఈ పిటిషన్ 27 న విచారణకు రానుంది.

Share post:

Popular