సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వాంగా వుంది.. మంత్రి ?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సప్తగిరి కూడా ఒకరు. ఇక తాజాగా సప్తగిరి నటించిన గూడుపుఠాని సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ సినిమాలో సప్తగిరి సరసన నేహా సోలంకి నటించింది. ఈ సినిమాకు కె ఎమ్ కుమార్ దర్శకత్వం వహించారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ,కటారి మహేష్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి ఈ విధంగా మాట్లాడారు.

గూడుపుఠాని ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని తెలిపారు. మా ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్ప్రా డెవలపర్స్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మేము ఇప్పుడు సినిమా రంగం వైపు వచ్చాం అని అన్నారు . సప్తగిరి కెరీర్ లో గూడుపుఠాని సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అదే తెలిపారు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. సూపర్ స్టార్ కృష్ణ గారి గూడుపుఠాణి టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను, మొదటిసారి థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించాను అని తెలిపారు సప్తగిరి. నా కథకు మంచి నిర్మాతలు హీరో దొరకడం నా అదృష్టం అని అన్నారు కె.ఎమ్ తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి. ఈ వేడుకకు ఆదోని ఎమ్మెల్యే క్రాంతి కుమార్, సంగీత దర్శకుడు ప్రతాప్ విద్య తదితరులు పాల్గొన్నారు.