గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంవత్సరం ముగిసిన కూడా అతడి జ్ఞాపకాలు చుట్టూ మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయారు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈయన మృతితో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విచారం అలుముకుంది విషయం అందరికి తెలిసిందే.
ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించిన ఆ గాయకుడిని మర్చిపోవడం అభిమానులకు వశం కావడం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సింగర్ లు గా ఎదిగారు.అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయి సంవత్సరం అవుతున్నా కూడా బాలుని తలుచుకుంటే ఇప్పటికీ చాలామంది కన్నీరుమున్నీరవుతున్నారు.
When Balu garu gave us a glimpse of his mimicry talent with the classic "Raavoyi Chandamama", in 5 different voices…#SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/L6NZVRk8Uh
— బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) September 28, 2021
అతడి జ్ఞాపకాలను పదేపదే నెమరు వేసుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో బాలసుబ్రహ్మణ్యం కి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది.రావోయి చందమామ అంటూ తన మధుర గాత్రంతో ఐదు రకాలుగా పాడిన పాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని బాలు జ్ఞాపకాలు అని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది.