బిగ్ బ్రేకింగ్: సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను కలచివేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికే ఆరు రోజులు అవుతున్నా కూడా నిందితుడు రాజు ఆచూకీ దొరకడం లేదు. ఈ విషయం పట్ల సినీ సెలబ్రిటీలు కూడా ఆ చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. ఈ నిందితుడు రాజు కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఆ నిందితుడిని పట్టుకున్న వారికి పది లక్షల ఇస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఆరేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన నిందితులు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.వరంగల్ జిల్లా స్టేన్ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజు అనుమానిస్తున్నారు. ఆ చేతి పై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది.అయితే దీని ఆధారంగా ఆ శవాన్ని రాజుదిగా గుర్తించారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంది.

Share post:

Popular