రీమేక్ లతో ఇబ్బంది పెట్టొద్దు అంటూ.. చిరుకి ఓ అభిమాని ఓపెన్ లెటర్..!

ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈయన ఎక్కువగా సినిమాలు రీమేక్ లోనే చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే తంతు లో చిరంజీవి అభిమాని ట్విట్టర్ ద్వారా ఇలా ఒక లెటర్ ని పోస్ట్ చేశారు.


ఒక సినిమాలో ఆ తార కాకుండా.. ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలు నటన. కన్యాశుల్కం లో ఎన్టీఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. ఇక చంటబ్బాయి సినిమా లో చిరంజీవి కనిపించడు. పాండురంగారావు మాత్రమే ఉంటాడు. నాకు ఆ చిరంజీవి కావాలి. ఆ రుద్రవీణ సూర్యం కావాలి. ఆ గ్యాంగ్ లీడర్ రాజారామ్ కావాలి. ఖైదీ 150, లూసిఫర్, సైరా ఇలాంటి సినిమాలు వద్దు. తెలుగు వాళ్లకి సినిమా పిచ్చి సార్! లూసిఫర్ మేము ఎప్పుడో చూసేశాం ఆయన మోహన్ లాల్ మనోడే ..పృధ్విరాజ్ మనోడే! మళ్లీ అదే కదా మీతో చూసి ఏం చేయమంటారు.

అయినా ఆ రీమేకులు కథలు తప్ప మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాట వరసకి”అర్థ కాలి”అంటూ ఉంటారు గాని, మీకు ఆకలి లేదు. ఆ సూర్యం లో పాత్రలో నేను సైతం అంటూ బయటకు వచ్చే నటుడు నాకు కనిపించట్లేదు.. ఖైది 150 కి మీరెందుకు సార్? మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో. వీళ్ళు సీన్లు తీయడంలో సినిమాని మర్చి పోయారు. మీరు పస్తు ఉండండి కొన్ని రోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి. అది చూడాలనుంది. తప్పుగా భావించకండి! మీకు అద్దం చూపించాలి మరి!

https://twitter.com/anuswaram/status/1440737393758199819?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440737393758199819%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fteluguadda.co.in%2Fan-open-letter-from-chiranjeevi-fan%2F