రియల్ హీరో ఆస్తులపై ఐటీ దాడులు..!

సహాయం చేయబోయి ఇరుక్కున్నట్టు అయింది సోనుసూద్ పని.. దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆర్థికంగా సహాయ పడిన విషయం తెలిసిందే. ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనుసూద్ పేరు తలచుకోగానే వెంటనే వారికి సహాయం చేశాడు.. ఎంతో మందికి అండగా నిలిచిన సోనుసూద్ నివాసాలు ,ఆఫీసులు, కంపెనీలపై ఇటీవల ఐటి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. ఇక ముంబైలో ఆరు ప్రాంతాల్లో ఐటి అధికారులు ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది..

- Advertisement -

 

ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రామ్ కు సోను సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.. అంతకుముందు కూడా పంజాబ్ ప్రభుత్వంలో కరోనా వైరస్ మీద ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సోనుసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు.. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బిజెపికి వ్యతిరేకంగా కావడం గమనార్హం

బిజెపి ప్రభుత్వం సోనూసూద్ పై కక్ష కట్టి వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సర్వే చేస్తున్నారని వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన ఇప్పటికి కరోనా కాలంలో కొట్టు మిట్టాడుతున్న ఎంతో మందికి ఆర్థిక సహాయం తోపాటు ,కావలసిన ఎన్నో సౌకర్యాలను అందించి అందరికీ రియల్ హీరోగా ,ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందాడు. ఈయన సుమారుగా తన ఆస్తులను సైతం నిరు పేదలకు పంచి పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప మానవతావాది పై ఐటీ అధికారులు దాడులు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular