పవన్ కళ్యాణ్ తో ఢీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కెరీర్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా స్పీడ్ మీద ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలాగే సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలకు దీని సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాలు కూడా మొదలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇందులో పవన్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది అన్నట్లు వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియమణి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయిన ప్పటికీ ఈ మధ్యనే బుల్లితెరపై మెరుస్తూ ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప, అలాగే విరాటపర్వం సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది. పవన్ హరీష్ కాంబినేషన్లో రాబోయే సినిమాలు ఆమె ప్రధాన పాత్ర పోషించే పోవచ్చు. అలాగే అది ఒక స్పెషల్ రోల్ అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే చూడాల్సిందే మరి.