పెళ్లి సందD హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా పెళ్లి సందడి. ఇక ఈ సినిమా సీక్వెల్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు పెళ్లి సందడి సినిమా తో తెలుగు తెరపై అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాకి కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ ను ఎంచుకోగా, కొన్ని అనివార్య కారణాలవల్ల తిరిగి శ్రీలీల అనే అమ్మాయి ని ఫైనల్ చేయడం జరిగింది.

ఈమె ఈ సినిమాలో నటించిన తర్వాత సినిమా నుండి ట్రైలర్ విడుదలైన కొద్ది రోజుల్లోని శ్రీలీల కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈమె ఎవరు అనే విషయానికి వస్తే ఈమె ఒక కన్నడ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా నటించింది.. తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ ,ఇంగ్లీష్, ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు. శ్రీలీల మాతృభాష తెలుగు అయినప్పటికీ ఈమె కర్ణాటక లో సెటిల్ అవడం జరిగింది.. కన్నడలో అర్జున్ సినిమాలో కూడా ఈమె ఒక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తర్వాత ఈమెకు మరెన్ని అవకాశాలు వస్తాయో వేచిచూడాలి.

Share post:

Popular