పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. మాకు సంబంధం లేదంటున్న ఫిలింఛాంబర్.. ప్రకటన వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.ఇదే తంతులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర దుమారం ఆయన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వం చిత్రసీమను ఇబ్బందులకు గురి చేస్తోంది అన్నట్లుగా మాటలను మాట్లాడాడు. నేను సినిమాలు తీయడం వల్లే సినీ పరిశ్రమకు ఇబ్బందులలో పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ ap ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఇదే తంతులోనే పవన్ కళ్యాణ్ వాక్యాలకు స్పందిస్తూ ఏపీ మంత్రులు తనదైన శైలిలో కౌంటర్లను తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల మద్దతు ఎంతో అవసరం. చిత్రపరిశ్రమకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి.

ప్రభుత్వం మద్దతు తెలిపిన అప్పుడే పరిశ్రమను కూడా కొనసాగుతుందని ఫిలించాంబర్ పేర్కొంది. ఈ విషయంపై ఎవరెవరు ఏమేం మాట్లాడిన మాకు సంబంధం లేదు వ్యక్తిగత అభిప్రాయాలు వివిధ వేదికలపై తెలియజేస్తున్నారు అన్నట్లుగా చెప్పుకొస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నిటినీ ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామని అయితే ఆ సమస్యలపై సానుకూలంగానే స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేసిందట.

TollywoodBoxoffice.IN on Twitter: "Press Note from Telugu Film Chamber of  Commerce… "