పవన్.. నీకు సిగ్గు లేదా.. నువ్వు హీరో నా.. పోసాని.. ఫైర్..!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అటు రాజకీయంలో ఇటు సినీ పరిశ్రమ లో చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.ఈయన పై భారీ ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఒంటరివాడుగా కనిపిస్తున్నాడు.ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఆయనకు సపోర్టు ఇవ్వడం లేదు.తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదంటూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.

ఇక ఇప్పుడు తాజాగా నటుడు పోసాని మురళి కూడా పవన్ పై ఫైర్ అవుతూ ఆయన ఏకిపారేశారు. పవన్ కళ్యాణ్ కి అసలు విలువలే లేవు.. అసలు ఒక హీరోకు ఉండవలసిన లక్షణాలు కూడా లేవు.. ఎవరి మాటా వినడు పవన్ కళ్యాణ్ కి తనని తాను ప్రేమించుకోవడం మాత్రమే తెలుసు. ఒక సినిమా వేడుకల్లో రాజకీయం మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం లేదని పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు పోసాని.

పవన్ కళ్యాణ్ అంత ఉన్నత స్థాయి ఉన్న హీరో ఒక మంత్రిని ఎందుకు తిడతాడు? పవన్ కళ్యాణ్ కి సిగ్గు అనిపించడం లేదా? ఎందుకంత లూజ్ కంటూ కామెంట్ చేశారు.పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ 10 కోట్లు అని అబద్ధం ఆడారు.. కానీ ఆయన 50 కోట్లు తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది అది నిజం కాదని నిరూపించండి. పెద్ద హీరో అంటే పెద్ద మనసు ఉండాలి. హీరోలు అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ వారి నటనలో 10% కూడా పవన్ కి రాదు.. వారు ఎప్పుడు ఏ విషయంలో కూడా తల దూర్చారు అంటూ కామెంట్లు చేశాడు పోసాని.