పవన్ ఫైర్ అయ్యింది ప్రభుత్వంపై అయితే.. ఎఫెక్ట్ ఆ స్టార్ హీరోలపై..!

సాయి తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సినిమాల విడుదలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై ఘాటుగా స్పందించారు. నేరుగా వైసీపీ ప్రభుత్వం, ఓ మంత్రి పై కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే నేరుగా తన సినిమాలను న్యాయం చేయాలని.. మిగతా సినిమాల్లో అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కదా.. మరి ఆ చిత్రాలకు సంబంధించి ట్యాక్స్ పెట్టారా లేదా అనే విషయాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది.

ఇందుకు సంబంధించి ప్రాంతాల వారీగా సినిమాలకు సంబంధించిన రిపోర్టు పంపాలని డిస్ట్రిబ్యూటర్ల ను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వానికి ఉన్న కోపం మిగతా హీరోల పై ఎఫెక్ట్ పడినట్లుగా కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. కాగా ప్రభుత్వం సినిమాలకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం కూడా త్వరలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని కూడా పలువురు సినీ పెద్దలు వ్యతిరేకించారు.

Share post:

Latest