పవన్ కళ్యాణ్ కు.. సైలెంట్ గా జలక్ ఇచ్చిన కలెక్షన్ కింగ్..!

పవన్ కల్యాణ్ నిన్న రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే అదేసమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల పైన కూడా విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. థియేటర్లను సొంతం చేసుకునే విధంగా విద్యానికేతన్ విద్యాసంస్థలు ఆలోచిస్తుందా అన్నట్లుగా ప్రశ్నించారు.

వైయస్ జగన్ కు దగ్గర బంధువు అయినటువంటి మోహన్ బాబు కూడా టాలీవుడ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ సీఎంతో ఎందుకు మాట్లాడలేదు అన్నట్లుగా నిలదీశారు. వీటన్నిటికీ స్పందిస్తూ మోహన్ బాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

తమ్ముడు పవన్ కళ్యాణ్.. నువ్వు నా కన్నా చిన్నవాడివి అందుకే ఏకవచనంతో సంభోగించాను అంటూనే.. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని, ఇదంతా చాలా తెలివితో కూడిన పని అని చెబుతూ మరికొన్ని మాటలను రాస్తూ ఒక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు మోహన్ బాబు.

ఇక ఇప్పుడు మా ఎలక్షన్లు జరుగుతున్నాయి విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడు అని నికు తెలుసు. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు పూర్తి అవుతాయి ఆ తర్వాత నాకు స్పందన ఏదో చెబుతాను అంటూ మోహన్ బాబు తెలియజేశాడు. చివరిగా మీ అమూల్యమైన ఓటుని సోదరుడు మంచు విష్ణుకు వేయవలసిందిగా కోరుకుంటున్నాను అని తెలియజేశాడు.

Share post:

Latest