కాబోయే భార్య‌తో అవినాష్ మ‌ధుర క్ష‌ణాలు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

జ‌బ‌ర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం అవినాష్ జ‌బ‌ర్దస్త్‌లో క‌నిపించ‌క‌పోయినా ఇత‌ర టీవీ షోల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. ఇక మ‌రోవైపు అవినాష్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇటీవ‌లె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అపై అవినాష్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫియాన్సీని అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు. అయితే సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ర‌న్ చేస్తున్న అవినాష్‌.. తాజాగా జ‌త క‌లిసే పేరుతో ఎంగేజ్‌మెంట్ వీడియోను షేర్ చేశాడు.

ఇందులో ఇరుకుటుంబ స‌భ్యులు పూలు పండ్లు మార్చుకోవ‌డం, ఆ త‌ర్వాత అనూజ‌, అవినాష్‌లు రింగ్స్ మార్చుకోవ‌డం, ఫొటో షూట్ వంటివి చూపించారు. అంతేకాదు, కాబోయే భార్య‌కు అవినాష్ రోమాంటిక్‌గా ముద్దు పెట్ట‌డం వంటి మ‌ధుర క్ష‌ణాల‌ను సైతం ఈ వీడియోలో చూపించారు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న అవినాష్ ఎంగేజ్‌మెంట్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular